Pawan Kalyan: సీఎం రేవంత్ తో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ.. వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం అందజేత

AP Deputy CM met Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్‌ను కలిశారు. ఇటీవల తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయనిధికి పవన్ రూ. కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన చెక్కును అందజేసేందుకు పవన్ కళ్యాణ్.. సీఎం రేవంత్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ను సీఎం రేవంత్ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం వరద సహాయక చర్యలతో పాటు ఇరు రాష్ట్రాల అభివృద్దిపై కాసేపు చర్చించారు.

Related News

Latest News