ఎసిబి దాడుల్లో పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్.

*రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ RI గోపరాజు, అతని ప్రైవేట్ అసిస్టెంట్.

ప్రతిపక్షం నాంపల్లి సెప్టెంబర్ 28: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో అవినీతి అధికారి ఏసీబి కి చిక్కాడు. తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గా పనిచేస్తున్న రాళ్లబండి గోపరాజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.వివరాలలోకి వెళితే రైతు వ్యవసాయ భూమికి సంబంధించి పంచనామా రిపోర్టును తహశీల్దార్ కు సమర్పించేందుకు రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. తన అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి అడ్డుల యాదగిరి (ఏ -2) ద్వారా ఈ లంచం తీసుకుంటుండగా, నల్గొండ రేంజ్ ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఏ -2 యాదగిరి వద్ద నుండి రూ.15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబి కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. ఫిర్యాదుదారు వివరాలను భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచారు.

*ప్రజలకు ఏసీబి విజ్ఞప్తి:
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేయాలని, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ (Telangana ACB), X (@Telangana ACB) ద్వారా సంప్రదించాలని ఏసీబి అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Spread the love

Related News

Latest News