కుకట్‌పల్లిలో రామ్‌దేవ్‌రావు హాస్పిటల్ సేవా స్ఫూర్తి..!

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా వాకథాన్, ఉచిత గుండె వైద్య శిబిరం – 406 మందికి ఉచిత సేవలు

కుకట్‌పల్లి, ప్రతిపక్షం, సెప్టెంబర్ 29: సామాజిక సేవలో రామ్‌దేవ్‌రావు హాస్పిటల్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్ ఆధ్వర్యంలో భారీ వాకథాన్, ఉచిత కార్డియాలజీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

గుండె ఆరోగ్యంపై అవగాహన కోసం వాకథాన్..

వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు కుముదినీదేవి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ ఆఫ్ సనత్‌నగర్ సహకారంతో ఈ వాకథాన్ నిర్వహించారు. ప్రముఖ రేకీ గ్రాండ్ మాస్టర్, సామాజిక కార్యకర్త శ్రీమతి లక్ష్మీ కమలాకర్ జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభించారు. నిత్యం వ్యాయామం, సమతుల ఆహారం, ఆరోగ్యకర జీవనశైలితో గుండెను కాపాడుకోవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ వాకథాన్‌లో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు డా. చాయాదేవి, డా. ప్రమోదిని, డా. మంజుల, డా. సుమన్ లత, కార్డియాలజిస్టులు డా. ప్రదీప్ రెడ్డి, డా. శ్రీకాంత్, రేడియాలజిస్టులు డా. లోకేష్ రెడ్డి, డా. మౌనిక, ఈఆర్ ఫిజీషియన్లు డా. స్వాతి రెడ్డి, డా. సుమ, డా. వీరభద్ర, పాథాలజిస్టులు డా. పావని, డా. చందనలతో పాటు డా. సుధారాణి, డా. నాగేంద్ర, డా. రోహిత్ నాయక్, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉచిత శిబిరానికి అనూహ్య స్పందన..

వాకథాన్ అనంతరం హాస్పిటల్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలతో పాటు కార్డియాలజీ వైద్యుల ఉచిత సంప్రదింపులు అందించారు. మొత్తం 406 మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్న హాస్పిటల్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకత్వంలో డా. కమలాకర్, డా. ప్రదీప్ రెడ్డి, డా. యోబు ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతమైంది.“ప్రజల ఆరోగ్యం – మా బాధ్యత”* అనే నినాదంతో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని రామ్‌దేవ్‌రావు హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది.

Spread the love

Related News

Latest News