ప్రతి పక్షం మునుగోడు సెప్టెంబర్ 29: మునుగోడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మునుగోడు మండలం గంగోరిగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా మునుగోడు మండలం బీరెల్లిగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
మరిగూడెం మండలం సరంపేట గ్రామంలో రూ.2.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.గట్టుప్పల్ మండలం నామాపురం గ్రామంలో రూ.2.55 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.అనంతరం నామాపురం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

































