వాసవి కాటన్ ఇండస్ట్రీస్ లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రశాంత్ రెడ్డి.


ప్రతిపక్షం, కొమురవెల్లి, నవంబర్ 13: రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు, వారు పండించిన పత్తికి గిట్టుబాటు ధర అందించాలనే లక్ష్యంతో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. శుక్రవారం చేర్యాల పట్టణంలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని, సరైన తూకంతో పత్తిని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి, చేర్యాల మండలాల అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్, మంజ మల్లేశం, చేర్యాల పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, మద్దూరు మండల అధ్యక్షులు మారెళ్ల భాస్కర్ రెడ్డితో పాటు చేర్యాల, కొమురవెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News