Trending Now

నిర్మల్‌లో హోలీ వేడుకలలో శోభాయాత్ర..

ప్రతిపక్షం నిర్మల్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా కేంద్రంలో శోభయమానంగా హోలీ శోభాయాత్ర జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్నత అధికారులు, సిబ్బంది పండుగలను ఎంతో సామరస్యం గా జరుపుకోవాలని నిర్మల్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రతి ఏడాది మాదిరి తీసే హోలీ కామ దేవుని శోభాయాత్ర ఎంతో శోభయమానంగా కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ,వి హెచ్ పీ బజరంగ్ దల్, ఆర్ఎస్ఎస్, హిందు వాహిని ఇతర సంఘాల నాయకుడు సాంప్రదాయ హోలీ పండగలను పెట్టుకుని నృత్యాలు చేస్తూ శోభాయాత్రను ముందుకు సాగించారు. సమస్యాత్మక ప్రాంతాలు జంక్షన్ ల వద్ద పోలీసులు ముందస్తు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర మతస్తుల ప్రార్ధన ఆలయాలపై ప్లాస్టిక్ కవర్లను కప్పివేసి సదరు ప్రార్థన ఆలయాలపై పోలీసు పీకెట్లను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల, నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి స్థానిక పట్టణ రూరల్ సీఐలు బందోబస్తు ఏర్పాటులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Spread the love

Related News