ప్రతిపక్షం ప్రతినిధి నిర్మల్, మే 20 : నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న సోమవారం తెల్లారుజామున మహారాష్ట్ర నుండి మంచిర్యాల జిల్లా వైపు వెళ్తున్న ఓ సిమెంట్ లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి నదిలో పడింది. దీంతో భారీ నష్టం కలిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్ర గాయాల పాలు కాగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన లారీ డ్రైవర్ ను బైంసా ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి లారీ నడపడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు జరిపిన విచారణలో తేలినట్లు సమాచారం.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు