Trending Now

Rahul Gandhi: 20 ఏళ్లుగా పెళ్లి ఒత్తిడి..స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi marriage: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లిపై మరోసారి స్పందించారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన శ్రీనగర్ విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. పెళ్లి విషయంపై కుటుంబం నుంచి ఒత్తిడి వస్తుందా? అని విద్యార్థులను రాహుల్‌ ప్రశ్నించారు. అయితే మీ పెళ్లి ఎప్పుడు అంటూ రాహుల్‌ను కొంతమంది విద్యార్థులు ఎదురు ప్రశ్న వేశారు. దీనికి రాహుల్ గాంధీ నవ్వుతూ స్పందించారు.

‘20 నుంచి 30 ఏళ్లుగా ఈ ఒత్తిడిని అధిగమించా. పెళ్లి విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. అలాగని వాటిని తోసిపుచ్చలేం.’ అని రాహుల్ చెప్పారు. దీంతో మీ పెళ్లికి మమ్మల్ని కూడా పిలవండి అంటూ విద్యార్థినులు రాహుల్‌ను కోరారు. తప్పకుండా పిలుస్తానంటూ రాహుల్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది.

Spread the love

Related News

Latest News