రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు..
ప్రతిపక్షం సిద్దిపేట రూరల్, నవంబర్ 14: ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేట రూరల్ మండలం నుంచి సుమారు 10,000 మంది ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీగా తరలివెళ్లి సభను విజయవంతం చేస్తామని రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండల పరిధిలోని గ్రామాలకు 800 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో పాటు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రం అంజిరెడ్డి, రాములు, పుల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పుల్లూరి కనకయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కోడారి మల్లారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రీక్కల మహేందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు గారిపల్లి వెంకటి, శ్రీనివాస్ రెడ్డి, బండి శివకుమార్, రమేష్, రఘుపతి, దుర్గయ్య, యాదగిరి, బాబు తదితరులు పాల్గొన్నారు.


























