Jammu Kashmir Encounter: భీకర కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లా ఆదిగామ్ గ్రామంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బందితోపాటు మరో పోలీసు అధికారి గాయపడ్డారు. వెంటనే గాయపడిన భద్రతా సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆర్మీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. దేవ్ సర్ ప్రాంతంలో ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపింది ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

Related News

Latest News