సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సిరిసిల్ల, ప్టెంబర్ 30: సిరిసిల్ల పట్టణంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వైపు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సీఎం పాదయాత్రగా బయలుదేరారు.ఈ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.సిరిసిల్లకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.భారీ జనసందోహం మధ్య సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణం వైపు ర్యాలీగా వెళ్లారు.

Spread the love

Related News

Latest News