ప్రతిపక్షం చండూరు సెప్టెంబర్ 30 : చండూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తహసీల్దార్ రమాకాంత్ శర్మ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ , కౌన్సిలర్లు హాజరయ్యారు
ఈ సందర్భంగా తహసీల్దార్ రమాకాంత్ శర్మ మాట్లాడుతూ… “రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులు దరఖాస్తు సమయంలో సరైన పత్రాలు సమర్పించి సహకరించాలి” అని అన్నారు.
*చైర్మన్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ…
“రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు ఎంతో భరోసానిస్తున్నాయి అని అన్నారు.పేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి అంటే పెద్ద భారం. ఆ భారాన్ని తగ్గించడానికి, ఆడపిల్లలకు అండగా నిలవడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించడం ద్వారా పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోంది అని చెప్పారు .చండూరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూస్తాం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడూ మేము అండగా ఉంటాం. లబ్ధిదారులు ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి” అని అన్నారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, చైర్మన్, తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు, సర్పంచులు, ఆర్ఐ మురళీ కృష్ణ, మణికాంత్, జీపీవోలు పాల్గొన్నారు.





























