ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లోక్‌సభ ఎన్నికల్లో దమ్కా ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) గురువారం తెర దించింది. దమ్కా లోక్‌సభ స్థానానికి శికరిపాడ ఎమ్మెల్యే నలిన్ సోరెన్‌ను జేఎంఎం నామినేట్ చేసింది. అదే విధంగా గిరిధిహ్ ఎంపీ స్థానానికి తుండి ఎమ్మెల్యే మథుర ప్రసాద్‌ను బరిలో దింపింది.