–మొబైల్లో బ్యాలెన్స్ లేకున్నా 112,కు సమాచారం.. వెంటనే స్పందించి బాధితుడిని రక్షించిన బ్లూకోట్ కానిస్టేబుల్ సంపత్.
— కానిస్టేబుల్ సంపత్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్.
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్ 16: ఆపదలో ఉన్న ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, సేవలను సద్వినియోగం చేసుకోవా లని జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాధితుడికి అర్ధరాత్రి వేళ తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించిన బుగ్గారం పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూకోట్ కానిస్టేబుల్ సంపత్‌ను జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్ ప్రత్యే కంగా అభినందించారు.వివరాల్లోకి వెళితే.. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వేముల సాయికుమార్ మద్దునూర్ గ్రామం నుంచి తిమ్మాపూర్ కు తన కారులో వెళ్తుండగా, మద్దునూర్ గ్రామ శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడి పోయింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో బాధితుడు సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించి న బాధితుడి మొబైల్ ఫోన్లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో ఇబ్బంది ఎదురైంది. అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు 112, కు కాల్ చేసి ప్రమాద సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి విధుల్లో ఉన్న బ్లూకోట్ కానిస్టేబుల్ సంపత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు.గోతిలో పడిన కారులో ఉన్న బాధితుడు వేముల సాయికుమార్‌ను గుర్తించి, అతనికి అవసర మైన తక్షణ సహాయం అందించి సురక్షితంగా రక్షించారు. అర్ధరాత్రి సమయం, నిర్మానుష్య ప్రాంతం అయినప్పటికీ విధి నిర్వహణలో అప్రమత్తతతో వ్యవహరించి బాధితుడికి అండగా నిలిచారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్ స్పందిస్తూ.. ఆపదలో ఉన్న వారికి సకాలంలో సహాయం అందించడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ఒక్క నిమిషం ఆలస్యం కూడా బాధితుల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుందని, అలాంటి సందర్భాల్లో పోలీసుల తక్షణ స్పందన ఎంతో కీలకమని తెలిపారు. బాధితుడి నుంచి సమాచా రం అందిన వెంటనే సంఘ టనా స్థలానికి చేరుకొని మానవతా దృక్పథంతో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ సంపత్‌ను అభినందించారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడ కుండా వెంటనే డయల్ 112, ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. మొబైల్లో సాధారణ కాలింగ్ బ్యాలెన్స్ లేకున్నా అత్యవసర సహాయం కోసం 112, సేవలను వినియో గించుకోవచ్చని, ప్రమాద సమయంలో బాధితులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

























