ఘనంగా హీరో తేజ సజ్జ నిశ్చితార్థ వేడుక.. హాజరైన సినీ ప్రముఖులు!

ప్రతిపక్షం, నవంబర్ 16: యువ కథానాయకుడు తేజ సజ్జ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ తాజ్ కృష్ణ హోటల్‌లో ఆయన నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరై తేజ సజ్జతో పాటు ఆయన కాబోయే జీవిత భాగస్వామిని ఆశీర్వదించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న జంటకు అభినందనలు తెలిపారు.

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు రవితేజ, నాని, శ్రీకాంత్, రానా దగ్గుబాటి ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. దర్శకులు ప్రశాంత్ వర్మ, అనిల్ రావిపూడి, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు సహా పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు వేడుకలో పాల్గొన్నారు. తమ అభిమాన హీరో నిశ్చితార్థం చేసుకోవడంతో తేజ సజ్జ అభిమానుల్లోనూ ఆనందం నెలకొంది. సినీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్న తేజ సజ్జ జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభం కావడంతో అభిమానులు, సినీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Latest News