భారతీయ జనతా పార్టీ – మెట్ పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “దీక్షా శిబిరంలో” పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. అనూప్ రావు.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్ 16: మెట్‌పల్లి పట్టణంలో బి.జె.పి, అధ్యక్షుడు ధోనికెల నవీన్ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు మాట్లాడుతూ మెట్టుపల్లి పట్టణ సమస్యల పైన ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. పట్టణ సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తున్న పట్టణ అధ్యక్షులు నవీన్ కు స్థానిక కౌన్సిలర్లకు భారతీయ జనతా పార్టీ కి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, జగిత్యాల జిల్లా కార్యదర్శి సుధవేణి మహేష్, కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్, కోరుట్ల పట్టణ ఉపాధ్యక్షులు మైదం సత్యనారాయణ, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News