హైకోర్టు ఆదేశాలతో రైతు కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా జమ.

*ఎల్ఐసి మ్యాపింగ్ పొరపాటుతో రైతు బీమా నిరాకరణ – న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన భార్య.

*కంటెంప్ట్ కేసుతో కదిలిన ప్రభుత్వం – బాధితురాలి ఖాతాలో రూ.5 లక్షలు జమ.

*అండగా నిలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, న్యాయవాది గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి

ప్రతి పక్షం సంస్థాన్ నారాయణపురం నవంబర్ 16 : సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గోగులోని బావి గ్రామానికి చెందిన రైతు కళ్లెం జంగారెడ్డి గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. మృతుడి కుటుంబానికి రైతు బీమా ఇవ్వాలని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌ను కోరగా… రైతు బీమా ఎల్‌ఐసీకి చెల్లించలేదని, మ్యాపింగ్‌లో పొరపాటు జరిగిందని చెప్పి నిరాకరించారు. దీంతో బాధిత కుటుంబం న్యాయం కోసం అడ్వకేట్ గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి ద్వారా మృతుడి భార్య కళ్లెం మంజుల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు స్పష్టంగా రైతు బీమా చెల్లించాలని జడ్జిమెంట్ ఇచ్చింది.

అయినప్పటికీ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ తీర్పును అమలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో మళ్లీ అడ్వకేట్ గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేయడం జరిగింది.చివరికి అగ్రికల్చర్, ఎల్‌ఐసీ డిపార్ట్‌మెంట్ జరిగిన పొరపాటును గుర్తించి, ఈనెల 12వ తేదీన కళ్లెం మంజుల అకౌంట్‌లో రూ.5,00,000/- రూపాయలు జమ చేయడం జరిగింది.ఈ విషయంలో కళ్లెం జంగారెడ్డి భార్య మంజుల గారికి మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నె నర్సింహారెడ్డి, గూడూరు వెంకటరెడ్డి, సురకంటి జనార్దన్ రెడ్డి, కళ్లెం మంజుల అన్న జాన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అండగా నిలబడ్డారు.ఈ కేసు వేయడానికి సహకరించిన అందరికీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Related News

Latest News