Trending Now

ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి..

రోడ్డెక్కిన మల్కపేట గ్రామ రైతులు

ప్రతిపక్షం, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామా రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు బుధవారం రోడ్డెక్కి ధర్నాకు దిగారు. కల్లలలో పోసి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేరని ఆవేదన వ్యక్తంచేశారు. కొనుగోలు ప్రక్రియను అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతుల హెచ్చరించారు. రైతుల ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News