Trending Now

మాజీ మంత్రిని కలిసిన కాంగ్రెస్ నేతలు..

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 22: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీ మంత్రి గీతారెడ్డి సూచించారు. బుధవారం మాజీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి తో సిద్దిపేట కాంగ్రెస్ కౌన్సిలర్స్ సాకి ఆనంద్, బుచ్చి రెడ్డి, కాంగ్రెస్ నేతలు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, మార్క సతీష్, తండ నవీన్ తదితరులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ సమస్యలపైన చర్చించారు. సిద్దిపేట కౌన్సిల్ సమస్యల పరిష్కార దిశగా తనవంతు సహకారం అందిస్తానని, తన మద్దతు ఎప్పుడు ఉంటుందని గీతారెడ్డి తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News