ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన 2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే నిర్మల్ కు చేరుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు కావాల్సిన (పార్ట్ -1) పాఠ్యపుస్తకాలు 81 శాతం వరకు నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నట్లు నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లాకు మొత్తం 3.61,776, పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అవసరం ఉండగా.. ఇప్పటివరకు జిల్లాకు 2,93,482 పాఠ్యపుస్తకాలు వచ్చినట్టు వివరించారు. త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలలకు సదరు పాఠ్యపుస్తకాలను దఫాలవారీగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.