పరకాల ఎమ్మెల్యే రేవూరి
ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, జూన్ 12: అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని ఇంటి దగ్గర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 46 మంది లబ్ధిదారులకు 46 లక్షల 5 వేల 336 రూపాయల చెక్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చెక్కులను నేరుగా ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అదికారులు, ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.