Telangana Govt Declared Holiday on Monday: రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా హైదరాబాద్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక, హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.