రాహుల్ జన్మదిన వేడుకలు ఘనంగా.. వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు

ప్రతిపక్షం, జూన్ 19: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కాశీలో కార్యకర్తలు వినూత్నంగా రాహుల్ గాంధీ చిత్రపటాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక చేతిలో రాజ్యాంగం, మరో చేతిలో గొడ్డలి పట్టుకున్న రూపంలో చిత్రపటాన్ని రూపొందించి గంగానదిలో పాలు, గులాబీ పూలతో అభిషేకం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కార్యకర్తలు తెలిపారు.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న నిబద్ధత ఎందరికో స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సైతం రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న సేవలను కొనియాడారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, మొక్కల నాటకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ రాహుల్ గాంధీ జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు.

Spread the love

Related News

Latest News