ప్రతిపక్షం, జూన్ 24: విజయ్ పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఫొటో అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పోస్టులో ‘00.00’ అని పేర్కొనడంతో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అయితే ఈ ఫొటో తాజాగా తీసిందా? లేక పాతదా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు విజయ్ గతంలో ధరించిన చొక్కానే ఇందులో కనిపిస్తోందని, అందువల్ల ఇది పాత చిత్రమని అంటున్నారు.
మరోవైపు ఫొటోలో కనిపిస్తున్న మొబైల్ ఫోన్ తాజా మోడల్‌కు చెందినదిగా ఉందని, అందువల్ల ఇది ఇటీవల తీసిన ఫొటో అయ్యే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫొటో ఎప్పుడు తీసిందనే విషయంపై త్రిష లేదా విజయ్ నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.

















