చౌటుప్పల్ లో చేయూత పెన్షన్ల మంజూరి పత్రాల పంపిణీ చేసిన రాజగోపాల్ రెడ్డి.

*2418 మందికి చేయూత పింఛన్ పత్రాలు అందజేసిన రాజగోపాల్ రెడ్డి.

*10 ఏండ్ల తర్వాత వచ్చిన శుభదినం – వేయి కళ్లతో ఎదురుచూసిన పింఛన్ దారులు .

*వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి – సీఎం దృష్టికి తీసుకెళ్తా.

*కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ – పేద ప్రజల కోసమే పని చేస్తుంది .

*మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ప్రతి పక్షం చౌటుప్పల్ నవంబర్ 17: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన నూతన చేయూత పెన్షన్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ ఆలపించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గం లోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ మండలం, చౌటుప్పల్ మున్సిపాలిటీ, నారాయణపూర్ మండలాలలో చేయూత పింఛన్ కు ఎంపికైన 2418 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరి పత్రాలను పంపిణీ చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ – 531 మంది , చౌటుప్పల్ మండలం – 970 మంది , నారాయణపూర్ మండలం – 917 మంది పింఛన్ అందుకున్న వారిలో ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఉన్నారు.

*కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ……..
వేయి కళ్లతో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న శుభదినం ఈరోజు వచ్చింది. 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇచ్చారు, ఆ తర్వాత కొత్త పింఛన్లు రాలేదు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని పింఛన్లు వచ్చాయి. ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు పింఛన్ ఇవ్వడం చాలా మంచి నిర్ణయం. వీరితోపాటు వృద్ధులకు కూడా ఇస్తే బాగుండేది. వృద్ధాప్య పింఛన్లు కూడా ప్రభుత్వం త్వరలోనే ఇవ్వాలని కోరుతున్నా. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. రాబోయే కాలంలో వృద్ధాప్య పింఛన్లు ఇస్తాం.
పింఛను పెంచే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలి, మీ తరపున నేను కొట్లాడుతా. ప్రభుత్వం ఉన్నది పెట్టుబడిదారుల కోసం కాదు, కాంట్రాక్టుల కోసం కాదు. ఈ ప్రభుత్వం పని చేయాల్సింది పేదల కోసం. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద వాళ్లకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది త్యాగాల పునాదుల మీద. అనుకున్న స్థాయిలో పేదవాళ్లకు న్యాయం జరగలేదన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం , యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ సీఈవో శోభారాణి , చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్, నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల ఎంపీడీవోలు, ఇతర అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు, చౌటుప్పల్ మున్సిపాలిటీ, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related News

Latest News