అర్హులైన చేనేత కార్మికులందరికీ చేయూత పింఛన్లు ఇవ్వాలి.

*చండూరులో 32 మంది చేనేత కార్మికులకు చేయూత పింఛన్ మొండి చేయి.

*పింఛన్లు మంజూరు అయ్యే వరకు పోరాడుతాం: సీపీఎస్ అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్.

*అర్హుల విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి న్యాయం చేయాలి: ఏలె శ్రీనివాసులు.

*మున్సిపల్ కమిషనర్ మల్లేషం కు వినతి పత్రం అందజేసిన చేనేత నేతలు .

ప్రతి పక్షం చండూరు నవంబర్ 18 : చండూరు మున్సిపాలిటీ పరిధిలో 32 మంది అర్హులను చేనేత చేయూత పింఛన్ కు ఎంపిక చేయలేదని, వారితో పాటు ఇంకా అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని చండూరు చేనేత సహకార సంఘం డైరెక్టర్ ఏలె శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్ తో పాటు పలువురు చేనేత కార్మికులు మున్సిపల్ కమిషనర్ మల్లేషం ని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏలె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతాధికారులు అర్హుల విషయంలో దృష్టి సారించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులను కలుస్తామని తెలిపారు.

*అర్హులందరికీ పింఛన్లు వచ్చే వరకు సీపీఎస్ పోరాడుతుంది: రాపోలు ప్రభాకర్
చండూరు మున్సిపాలిటీతో పాటు మునుగోడు నియోజకవర్గంలోని అర్హులైన చేనేత కార్మికులందరికీ చేయూత పింఛన్లు మంజూరు చేసే వరకు చేనేత పరిరక్షణ సేవా సమితి (సీపీఎస్) పోరాడుతుందని సీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్ అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల పింఛన్ల విషయంలో అన్యాయం జరిగిందని, దీనిపైన అంచెలంచెలుగా ఉద్యమిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో చేనేత వృత్తిని పరిరక్షించడానికి, పేద కార్మికులను అన్ని విధాల ఆదుకోవటానికి సీపీఎస్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైతే కార్మికులు ఉంటారో అక్కడ సీపీఎస్ కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో చెరుపల్లి రాము, గుండు సంతోష్, గంజి పాపయ్య, గడ్డం శేఖర్, రుద్ర స్వామి, గంజి అశోక్, జల్ద దశరథ, చెరుపల్లి శ్రీను, వర్కాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News