జర్నలిస్టు సంఘ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా సీనియర్ జర్నలిస్ట్ వరుకోలు కళాచందర్

ప్రతిపక్షం హుస్నాబాద్, నవంబర్, 18: వర్కింగ్ జర్నలిస్టుల సంఘమైన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజె) (హెచ్-143) యొక్క రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వరుకోలు కళాచందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఈ ఎన్నికను వెల్లడిస్తూ ఎన్నికైన సభ్యులకు సదరు వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అభినందనలు తెలియజేసింది. 33ఏళ్ల జర్నలిజ అనుభవం కలిగిఉన్న సదరు కళాచందర్ జర్నలిజంతో పాటు పలురంగాల్లో రాణింపును కలిగి ఉన్నారు. విద్యావేత్తగా పలుసబ్జెక్టుల బోధనాపర ఆచార్య స్థాయిల ఉత్తీర్ణతలతో అర్హతలు సాధించిన కళాచందర్ సమాచార హక్కు చట్టం అమలైన తొలినాళ్ళలోనే ఆ చట్టం యొక్క 4(1)b అమలు కోసం కృషిచేసి పలు ప్రభుత్వ ప్రజాసంస్థలలో ఆ 4(1)b ని అమలు చేయించారు.

సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రాష్ట్ర సమాచార కమిషన్ లోని అప్పటి వ్యవస్థపాక స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ జన్నత్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పడిన పౌరసమాజ ఎంపిక మేరకు జాతీయ స్థాయిలో ఢిల్లీలో ప్రతి సంవత్సరం జరిగే దేశస్థాయి పార్టీ సమీక్ష సమావేశాలకు ప్రతినిధిగా ఎన్నికై పల్లె జనాలకు సమాచార హక్కు చట్టం యొక్క తోడు నీడ యొక్క అవకాశాన్ని అవసరాన్ని ఆవశ్యకతను ఢిల్లీ వేదికలపై వివరించారు. చట్టం వచ్చిన తొలినాళ్లలోనే 4(1)b పై జరిపినటువంటి కృషికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ద్వారా, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా ముఖాముఖిగా ప్రత్యేక ప్రశంసలను అందుకున్నారు.

కాగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్

సంఘానికి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా సదరు వరుకోలు కళాచందర్ ఎన్నికగావడం పట్ల సదరు సంఘ సభ్యులు, నాయకులు, ప్రతినిధులు, ఈ ప్రాంత వ్యాపార వాణిజ్య రంగాలవారు, మేధోవర్గాలు, పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, యువత అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బుధవారం నాడు వెలువరించిన ఒక పత్రికాప్రకటనలో కళాచందర్ యూనియన్ యొక్క వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ తాజామాజీ చైర్మన్ అల్లం నారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ గారికి, టెంజు (TEMJU) రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కి, రాష్ట్ర ఎన్నికల అధికారి గొర్ల బుచ్చన్న కి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహచర సభ్యులకు సంఘ నాయకులకు, సిద్దిపేట యూనిట్ తో పాటు అన్ని జిల్లాల యూనిట్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related News

Latest News