Vinayaka immersion: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. నిమజ్జన సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరం కలిసి వీటిని ప్రశాంతంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. నిమజ్జన కార్యక్రమాల్లో ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. మరోవైపు ట్యాంక్‌బండ్ వద్ద భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాట్లను పరిశీలించింది. మంగళవారం గణేశ్ నిమజ్జనం దృష్ట్యా ఇక్కడ ఏర్పాట్లపై ఆరా తీశారు. పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. ప్రతి ఏడాది లాగే నిమజ్జనానికి అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.