Atishi as the new Chief Minister of Delhi:ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇవాళ సాయంత్రం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ఆప్ కన్వీనర్, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు. దీంతో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నదానిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా, ఇతర ఎమ్మెల్యేలు బలపరిచారు. దీంతో ఢిల్లీ తుదపరి సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి అతిశీ కావడం గమనార్హం. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్న సమయంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.