Trending Now

Bengal Floods: బెంగాల్‌ వరదల వెనుక కుట్ర.. పశ్చిమ బెంగాల్ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు

Conspiracy behind Bengal Floods?: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వరదలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరదల వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) డ్యామ్‌ల వద్ద డ్రెడ్జింగ్‌ చేయడంలో విఫలమైందని.. అందువల్లే బెంగాల్‌లోని పలు జిల్లాల్లో వరదలు సంభవించాయని ఆరోపించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love

Related News

Latest News