Telangana Cabinet Key Decisions on Hydra: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సెక్రటేరియట్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించామని, హైడ్రాకు అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.