High Court angry on ‘Hydra’: ‘హైడ్రా’ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కమిషనర్ రంగనాథ్ ఈ విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా హైకోర్టు ‘హైడ్రా’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాతనే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని, శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేశారు.