Train Accident: చెన్నై శివారులో రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు

Train Incident in Chennai trains cancelled: తమిళనాడులోని చెన్నై శివారులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కవరైప్పెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్‌ రైలును మైసూర్‌-దర్బంగా భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల నుంచి మంటలు చెలరేగగా.. 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పలువురు ప్రయాణికులు గాయపడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. విజయవాడ-డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలును కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది. కడప, తిరుపతి, అరక్కోణం, నెల్లూరు, సూళ్లూరుపేట, విజయవాడ రూట్లలోనూ పలు రైళ్ల రద్దయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకోవడానికి చెన్నై రైల్వేస్టేషన్‌లో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు.

Related News

Latest News