ప్రతిపక్షం, జూన్ 17: నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై తమిళనాడులో చర్చ జోరందుకుంది. ఆయనను డిప్యూటీ సీఎంగా చూపిస్తూ అభిమానులు రూపొందించిన ఏఐ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఫ్యాన్ పేజ్‌లో ఈ పోస్టర్ వెలువడటంతో రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. రాఘవ లారెన్స్ త్వరలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అభిమానులు మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

















