ప్రతిపక్షం, జూన్ 23: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయనతో సన్నిహిత సంబంధాలపై గతంలో పలు ప్రచారాలు ఎదుర్కొన్న నటి త్రిష సోషల్ మీడియాలో ఎలాంటి బర్త్‌డే విషెస్ తెలియజేయకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది.
ఇటీవల విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకే త్రిష బహిరంగంగా స్పందించలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై విజయ్ లేదా త్రిష నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కేవలం సోషల్ మీడియాలో విషెస్ చెప్పకపోవడాన్ని ఆధారంగా చేసుకుని వారి వ్యక్తిగత సంబంధాలపై నిర్ధారణకు రావడం సరైంది కాదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, అభిమానులు మాత్రం “కనీసం ఒక బర్త్‌డే పోస్ట్ అయినా పెట్టాల్సింది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

















