డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం: అక్షయ్ కుమార్

ప్రతిపక్షం, జూన్ 24: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆరోగ్యం, సంపదపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సినీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, డబ్బు కంటే ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

డబ్బు లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చినా మళ్లీ సంపాదించుకోవచ్చని, కానీ ఆరోగ్యం దెబ్బతింటే తిరిగి పొందడం అంత సులభం కాదన్నారు. కుటుంబం కోసం ఎక్కువ సంపాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజమేనని, అందులో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నారు.

డబ్బు అవసరం లేదని చెప్పేవారు ఇప్పటికే ధనవంతులు కావొచ్చు లేదా ప్రపంచానికి దూరంగా జీవించే సాధువులు కావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. జీవితంలో సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని అక్షయ్ కుమార్ తెలిపారు.

Spread the love

Related News

Latest News