దుస్తుల వ్యాఖ్యలపై సునీత వివరణ.. మహిళలకు సమాన హక్కులే నా అభిమతం

ప్రతిపక్షం, జూన్ 26: మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో గాయని సునీత స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, మహిళలను కించపరచడం లేదా వారి స్వేచ్ఛను ప్రశ్నించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని తాను ఎప్పటికీ సమర్థించనని, అలాంటి వారిని ప్రోత్సహించే ఆలోచన కూడా లేదని తెలిపారు. కొంతమంది మహిళలను తప్పు దృష్టితో చూసే తీరు పట్ల కలిగిన ఆవేదనతోనే ఆ వ్యాఖ్యలు చేశానని వివరించారు.

మహిళలకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు లభించాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని సునీత పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని, వాటికి తప్పుడు అర్థాలు వెతకవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News