Trending Now

న్యూయార్క్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి పొన్నం..

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 21 : భారత దేశ మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి ఆనాడు చేపట్టిన కార్యాచరణలో భాగంగానే ఈరోజు భారతదేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించడానికి కారణమైందని.. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం తేవడానికి కూడా నేరుగా ఢిల్లీ నుండి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి , పల్లెలు బాగుండాలని ఆశించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ అని అటువంటి వ్యక్తికి కొనియాడి నివాళులు అర్పించడం మన బాధ్యత అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News