Train accident in Uttar Pradesh: యూపీలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో ఓ బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలుకు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే దాదాపు 20కు పైగా బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో ఢిల్లీ- మథుర మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని నేషనల్ క్యాపిటల్ రీజియన్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు.