భట్టి విక్రమార్క ఫొటోను షేర్ చేసిన ట్రంప్

ప్రతిపక్షం, జూన్ 27: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లే రహదారికి తెలంగాణ ప్రభుత్వం **‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేసిన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రత్యేక పోస్టు చేస్తూ, “భారత్‌లోని హైదరాబాద్‌లో ‘ది న్యూ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’.. ఇలాంటి గౌరవం పొందిన తొలి అమెరికా అధ్యక్షుడిని నేనే. ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

అలాగే, అమెరికా రాయబారి సెర్గియోతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఫొటోను కూడా ట్రంప్ తన పోస్టుతో పాటు పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Related News

Latest News