- నివాళులర్పించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ప్రతి పక్షం నారాయణపూర్ నవంబర్ 19 : నారాయణపూర్ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ 109 వ జయంతి వేడుకల్లో పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇందిరా గాంధీ గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చారని, నాటి నుండి నేటి వరకు ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే పేదరిక నిర్మూలన విషయంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కొనియాడారు.ఇందిరాగాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నారాయణపురం మండలానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



























