నల్లగొండ కాంగ్రెస్ లో కాక..! రాజగోపాల్ రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అల్టిమేటం.

  • పార్టీలో ఉండాలంటే ఉండండి.. లేదంటే కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోండి.
  • దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకోండి.. మీ నాయకత్వంలో మీరే నడిపించుకోండి.
  • మంత్రి పదవి రాలేదని పార్టీని, ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తారా..?
  • క్రమశిక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు.. రాజగోపాల్ రెడ్డి అయినా.. నేనైనా ఒక్కటే
  • డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత.

ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 19: నల్లగొండలో కాంగ్రెస్ రాజకీయాల్లో కాక రేగింది. యాదవ సంఘం భవనంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత బాంబులాంటి వ్యాఖ్యలు చేశారు.రాజగోపాల్ రెడ్డికి పున్న కైలాష్ నేత అల్టిమేటం ఇచ్చారు. పార్టీలో ఉండాలంటే ఉండండి.. లేదంటే కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోండి అని సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకోండి.. మీ నాయకత్వంలో మీరే నడిపించుకోండి అని సవాల్ విసిరారు.మంత్రి పదవి రాలేదని పార్టీని, ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తారా..? కాంట్రాక్టులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై కత్తి కడతారా..? కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ నే కూల్చే ప్రయత్నమా..? అని నిలదీశారు.చెట్టు కింద ఉంటూ అదే చెట్టును నరికితే నష్టపోయేది ఎవరు..? అని ప్రశ్నించారు.ఒకవేళ డిసెంబర్ లో మంత్రి పదవి వస్తే ఇప్పటివరకు చేసిన విమర్శలన్నీ మాఫీ అవుతాయా..? అని ఎద్దేవా చేశారు.రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తా.. ఆధారాలన్నీ పంపిస్తా..! అని స్పష్టం చేశారు.క్రమశిక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు.. రాజగోపాల్ రెడ్డి అయినా.. నేనైనా ఒక్కటే..! అని అన్నారు.కాంగ్రెస్ లో ఉంటారా..? కొత్త పార్టీ పెడతారా..? రాజగోపాల్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు.పార్టీ సహనానికి హద్దు ఉంది.. గీత దాటితే వేటు తప్పదు..! అని హెచ్చరించారు.

Related News

Latest News