Minister Sridhar Babu: గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో పలు అభివృద్ది పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..యువతకు ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.
రూ.8వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.. రూరల్ టెక్నాలజీ సెంటర్లో వచ్చే ఏడాది వెయ్యి మందికి శిక్షణ అందించేలా ఈ సెంటర్ను అభివృద్ధి చేస్తామన్నారు. సింగరేణి ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తేనే మనకు వెలుగులు ఉంటాయన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేశామని, రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి చెప్పారు.