సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర

ప్రతిపక్షం, నవంబర్ 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి ముందుగా ముస్తాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ముస్తాబాద్ చౌరస్తా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. సిద్దిపేట బైపాస్ రోడ్డులోని నాగదేవత ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు ముఖ్యమంత్రి నడుచుకుంటూ చేరుకున్నారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ముఖ్యమంత్రి పాదయాత్రలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ పాదయాత్ర చేపట్టారు. అనంతరం సభా వేదికపై ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

Related News

Latest News