ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానవత్వాన్నిచాటుకున్నారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్‌కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటుగా నర్సంపేటకు వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి వెంటనే కారు దిగారు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించారు. సకాలంలో బాధితుడికి అండగా నిలిచిన కేటీఆర్‌ను పలువురు ప్రశంసించారు.