Trending Now

‘ప్రభుత్వ భూమిని కాపాడండి’.. కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా

ప్రతిపక్షం, సంగారెడ్డి ప్రతినిధి, జూలై 01: అమీన్ పూర్ మున్సిపల్ బీరంగూడ లో 993 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమ దస్తావేజు లతో 842, 844 సర్వే నెంబర్ వేసుకొని తప్పుడు దస్తావేజు లతో 5,000 వేల గజాలు సుమారు రూ. 50 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని.. బీరంగూడ గ్రామస్తుల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బీరంగూడ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తప్పుడు డాక్యూమెంట్ల తో కోట్ల రూపాయలు విలువ జేసే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని తక్షణమే అక్రమంగా నిర్మించి ప్రహరీ గోడను తొలగించాలని డిమాడ్ చేశారు. 842, 844 సర్వే నెంబర్ తో ప్రభుత్వ భూముల్లో రేజిస్టర్ చేస్తున్న వారిపై సబ్ రీజస్టర్ పై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు అదేల్లి రవీందర్, నందారం రమేష్ గౌడ్, కొకల శ్రీనివాస్, ప్రకాష్, ఏడ్ల రాజమల్లేష్ మాకం మల్లేష్, చిన్న వీరేశం, శంకర్ పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News