ఎమ్మెల్యే, సంజయ్ ఇంటి ముట్టడి హేయమైన చర్య.

— “రాజకీయ పోరాటం” పేరుతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించొద్దు.
— రైతుల సమస్యలపై దృష్టి సారించాలి.
— బి.జె.పీ, జిల్లా వైద్య, విభాగం కన్వీనర్ డాక్టర్. గంగాసాగర్.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్,19: కోరుట్ల ఎమ్మెల్యే, కల్వకుంట్ల సంజయ్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వ డం, రాజకీయ ఘర్షణలకు దారితీసే విధంగా వ్యవహరించడం సరికాదని బి.జె.పి, జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్. గంగాసాగర్ పేర్కొ న్నారు. రాజకీయ పార్టీల మధ్య పోరాటాలు ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కదారి పట్టించకూడదని అన్నారు. ఆయన నివాసం లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యంలేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కోరుట్ల, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వడ్ల, కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, గన్నీ సంచులు, తూకం యంత్రా లు, హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ధాన్యం విక్రయించిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు చెల్లింపులు చేయాలని అన్నారు. అలాగే కోరుట్ల 100, పడకల ప్రభుత్వ ఆసు పత్రిలో పూర్తిస్థాయి వైద్య సదుపా యాలు కల్పించాలని, నియోజకవర్గంలోని సాగునీరు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్, పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా పరస్పర రాజకీయ విమ ర్శలు, ఘర్షణలకు దిగడం వల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ నియోజ కవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్న సమయంలో రాజకీయ పోరాటాలు చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్. గంగాసాగర్, పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ముందుగా స్పందించి,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జిల్లా కార్యదర్శి సుదవేని మహేష్, బిజెపి, పట్టణ ప్రధాన కార్యదర్శి జుంగుల అనిల్ గౌడ్, కలికోట శ్రీకాంత్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప, వేణుగోపాల్, జిల్లా ఎస్సీ, మోర్చా ఉపాధ్యక్షుడు సుంకే అశోక్, జిల్లా కిషన్ మోర్చా కార్యదర్శి కలలి రాజిరెడ్డి, ఓబీసీ, మోర్చా అధ్యక్షుడు సంకు ప్రసాద్, తిరుసుల్లా అర్జున్, తోకల సత్యనారాయణ, తల్లోజు భాస్కర్, సంబోజి శ్రీధర్, ఆచారి గుండు మోహన్, బీజేవైఎం,ప్రధాన కార్యదర్శి భీమ్నాథ్ విజయ్, బీజేవైఎం, పట్టణ ఉపాధ్యక్షుడు అనసూయ, చారి, మరియు బిజెపి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News