యువ ఫిల్మ్‌మేకర్‌కు అండగా సోనూ సూద్.. ‘మంగళవారం సర్జరీ చేస్తాం’

ప్రతిపక్షం, జూన్ 29: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువ సినీ దర్శకుడికి అత్యవసరంగా వెన్నెముక శస్త్రచికిత్స అవసరమని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ విజ్ఞప్తి చేశారు. సోనూ సూద్‌ను ట్యాగ్ చేస్తూ బాధితుడికి సహాయం చేయాలని కోరారు.

ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన సోనూ సూద్.. “డోంట్ వర్రీ.. మంగళవారం సర్జరీ జరుగుతుంది” అంటూ భరోసా ఇచ్చారు. ఆయన స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, మరోసారి కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచిన సోనూ సూద్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Spread the love

Related News

Latest News