కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 16 : ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు, సబ్బండ వర్గాలు సంయమనం పాటించాలని, ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పిలుపునిచ్చారు. బీజేపీ కులమతాల పేరిట రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని, అందరు కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేలా సహకరించాలని కోరారు. సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. విద్వేషాలు వీడి అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని పేర్కొన్నారు.