Harish Rao Fires on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కందుకూరులో ప్రభుత్వ భూమిని కొట్టేసే కుట్ర జరుగుతోందని, సర్వే నంబర్ 9లోని 385 ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రేవంత్‌వి చిట్చాట్లు కాదు..‘చీట్‌చాట్‘లు అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని, రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లి లేదా సంగారెడ్డికి రాహుల్ గాంధీని తీసుకెళ్దామన్నారు. అక్కడ రైతులకు రుణమాఫీ అయిందా లేదా అనే విషయం అడగాలని సవాల్ విసిరారు. రైతులనే కాదు..రాహుల్ గాంధీని కూడా సీఎం రేవంత్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.